
తను నటిస్తున్న హిట్ 3 చిత్రం గురించి అడగగా."హిట్ యూనివర్స్‌లో ప్రతి ఆలోచన కూడా నా దగ్గరకే ముందు వస్తుంది. ప్రస్తుతం కథ సిద్ధం అవుతుంది.వర్క్ పూర్తయిన వెంటనే మొదలుపెడతాం" అని నాని అప్డేట్ ఇచ్చాడు. అలాగే హాయ్ నాన్నపై నాని లీక్ ఇవ్వమని అంటే.. హాయ్ నాన్న ఇంటర్వెల్ కి అస్సలు ఇంటర్మిషన్ అని ఉండదు. హాయ్ అని వస్తుంది" అని నవ్వుతూ నాని తెలిపారు బలగం ఫేమ్ వేణుతో ఎల్లమ్మ అనే ప్రాజెక్ట్ గురించి అడగగా "ప్రస్తుతానికైతే ఏమి లేదు. అయితే దిల్ రాజు గారు, వేణు నాతో వర్క్ చేయాలని అనుకుంటున్నారని అయితే చెప్పారు. వేణు ఎంతో టాలెంట్ వున్న దర్శకుడు. బలగం చూసిన తర్వాత తనలో ఇంత టాలెంట్ ఉందా అని అనుకున్నాను. తను వచ్చి నాకు కథ చెబితే ఐయామ్ వెరీ హ్యాపీ" అని నాని తెలిపారు.