తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం మహేష్ ... త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ ని సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తూ ఉండగా .... మీనాక్షి చౌదరి , శ్రీ లీలా ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో రమ్యకృష్ణ , జయరామ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ను ఫుల్ స్పీడ్ గా పూర్తి చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ మేకర్స్ కేరళ లో ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ ను మహేష్ మరియు శ్రీ లీల పై చిత్రీకరించాలి అని డిసైడ్ అయ్యారు. ఇక కేరళలో సాంగ్ ను చిత్రీకరించాలి అని డిసైడ్ అయిన తర్వాత అక్కడ పరిస్థితులు ప్రస్తుతం బాగోకపోవడంతో ఆ సాంగును రామోజీ ఫిలిం సిటీ లో ఒక ప్రత్యేక సెట్ లో చిత్రీకరించాలి అని మూవీ బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సాంగ్ షూటింగ్ లో మహేష్ బాబు డిసెంబర్ 10 వ తేదీన జాయింట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: