ఈ ఏడాది అత్యంత విషాదకరమైన ఘటన ఏదైనా ఉంది అంటే.. అది చెన్నై కు వరదలు రావడమే. మిచౌంగ్ తుఫాను వలన చెన్నై నగరం అతలాకుతలం అయ్యింది.ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. మరెంతోమంది ప్రాణాలు విడిచారు. ఇప్పటికీ ఆ వరద నీటిలో తిండి లేక బాధపడుతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఈ అనుకోని సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తమ శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఇంకోపక్క సినీ సెలబ్రిటీలు సైతం తమవంతు సాయం అందిస్తున్నారు. స్వచ్ఛందంగా తమ అభిమానులను తిండిలేక అల్లాడుతున్నవారికి సాయం చేయమని కోరుతున్నారు. అయితే ఇలాంటి దుర్భర పరిస్థితి గురించి ఏ మాత్రం ఆలోచించకుండా..ఒక నటి మాత్రం వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నా అని వీడియో తీసి పెట్టడం సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఆమె పేరు శివాని నారాయణన్. తమిళ్ బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా వెళ్లి పేరు తెచ్చుకొంది, హిందీ, తమిళ్ సినిమాలో నటిస్తూ బిజీగా మారింది. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో.. సంతానం అదేనండీ విజయ్ సేతుపతి రెండో భార్యగా కూడా నటించింది.

తాజాగా ఈ చిన్నది.. చెన్నై నగరంలో కురుస్తున్న వర్షంలో ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. పింక్ కలర్ టీ షర్ట్, బాక్సర్ వేసుకొని వర్షపు నీటిలో ఆటలాడుతూ కనిపించింది. ఇక దీనికి chennairains అని హ్యాష్యాగ్ ను కూడా పెట్టుకొచ్చింది. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వివాదాస్పదంగా మారింది. శివానిని నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. చెన్నై ఉన్న పరిస్థితి ఏంటి.. ? నువ్వు చేస్తున్న వీడియో ఏంటి అని కొందరు.. ఛీ.. సిగ్గులేదు.. ఒకపక్క జనాలు తిండి లేక ఏడుస్తుంటే.. నీకు ఎంజాయ్ కావాల్సి వచ్చిందా.. ? అని ఇంకొందరు.. వీలైతే సాయం చేయి.. లేకపోతే ఇంట్లో కూర్చో.. కానీ, ఇలాంటి వీడియోలు చేసి మానవత్వం లేనిదానిలా మారకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: