సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రష్మిక మందన్న.. ప్రస్తుతం నార్త్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇప్పటికే నేషనల్ క్రష్ గా గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇక నటిస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతూ ఉండడంతో.. కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఇకపోతే ఇటీవలే రష్మిక మందన్న హీరోయిన్గా రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇన్నాళ్ళ వరకు రష్మిక మందన్న సౌత్ లో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలో నటించింది. అయితే కొన్ని సినిమాల్లో గ్లామర్ వలకబోత కూడా చేసింది. కానీ ఇటీవల సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమాలో మాత్రం ఇక గ్లామర్ షోకే ఎక్కువగా ప్రాధాన్యమించింది రష్మిక. ఈ క్రమంలోనే బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి మరి నటించింది. ఏకంగా రణబీర్ కపూర్ తో ఇంటిమేట్ సీన్స్ చేయడానికి కూడా రెడీ అయిపోయింది. ఈ క్రమంలోనే రష్మిక మందన అతిగా అందాల ఆరబోత చేసింది అంటూ కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి అని చెప్పాలి.


 ఇక ఎన్ని విమర్శలు వచ్చినా అటు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. అయితే యానిమల్ సినిమాలో తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రష్మిక మందన్న. ఈ మూవీలో తాను పోషించిన గీతాంజలి పాత్ర తనకి ఎంతో నచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే వర్ణించలేనంత ఆనందంగా ఉంది. మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రశంసలు వస్తూనే ఉన్నాయి.  గీతాంజలి పాత్ర ఎంతో నచ్చింది. ఆ పాత్రలో నటించిన ప్రతి సీన్ ను కూడా ఎంజాయ్ చేశాను  చిత్రీకరణ సమయంలో మూవీ టీం తో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అంటూ రష్మిక మందన చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: