మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా పై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా మరో నెల రోజుల్లో ఈ సినిమా థియేటర్ల లో రిలీజ్ కానుంది.సంక్రాంతి కానుకగా రిలీజైన మహేష్ సినిమా లలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యం లో గుంటూరు కారం మూవీ కూడా బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమా లో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటిస్తున్నారు. పూజా హెగ్డే స్థానం లో మీనాక్షి చౌదరి ఎంపిక కాగా గుంటూరు కారం సినిమాతో స్టార్ హీరోయిన్ల జాబితా లో చేరతానని ఆమె భావిస్తున్నారు. తాజా గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న మీనాక్షి చౌదరి మహేశ్ బాబు చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని అన్నారు. మహేశ్ బాబు సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారని ఆమె కామెంట్లు చేశారు. నేను గుంటూరు కారం సెట్ లోకి వచ్చిన మొదటి రోజు టెన్షన్ పడ్డానని మీనాక్షి చౌదరి పేర్కొన్నారు.ఫస్ట్ షాట్ లోనే మహేశ్ తో కలిసి పని చేశానని ఆమె అన్నారు. ఆ సమయం లో నేను కంగారు పడటంతో మహేశ్ బాబు టెన్షన్ పడవద్దని కొంచెం టైమ్ తీసుకోండని చెప్పారని ఆమె కామెంట్లు చేశారు. ఏం కాదంటూ మహేశ్ బాబు కూల్ గా మాట్లాడారని మీనాక్షి చౌదరి అన్నారు. మీనాక్షి చౌదరి చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.మీనాక్షి చౌదరి రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న మీనాక్షి చౌదరి తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. త్వరలో గుంటూరు కారం మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: