సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది జైలర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.జైలర్ సినిమా తలైవాకు సూపర్ కమ్ బ్యాక్ మూవీ గా నిలిచింది. జైలర్ హిట్ తరువాత తర్వాత ఫుల్ ఫామ్ లో వున్న  రజినీకాంత్‌ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు.ఇప్పటికే తలైవా 170 తో రజినీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.a ఈ సినిమా టైటిల్‌ను రజినీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యథార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో రజనీ బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడే పోలీసు అధికారికంగా కనిపించనున్నట్లు సమాచారం.ఈ మూవీలో గురు ఫేం రితికా సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, ఫహద్‌ ఫాసిల్‌, మంజువారియర్‌ మరియు దుషారా విజయన్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. తలైవా 170 మూవీ 2024లో థియేటర్లలో సందడి చేయనుంది.జైభీమ్‌ వంటి సామాజిక సందేశాత్మక మూవీ ని అద్భుతంగా తెరకెక్కించిన జ్ఞానవేళ్‌  తలైవాను ఏ విధంగా చూపించబోతున్నాడని ప్రేక్షకులు ఎంతో ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రజినీకాంత్‌ మరోవైపు కూతురు ఐశ్వర్య రజినీకాంత్‌ దర్శకత్వంలో వస్తున్న లాల్‌సలామ్‌ అనే మూవీ లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్‌ పూర్తయింది 2024 పొంగల్ కానుకగా లాల్ సలామ్ మూవీ విడుదల కానుంది. రజినీకాంత్‌ దీంతో పాటు స్టార్ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తలైవా 171 సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు.. ఖైదీ, విక్రమ్‌ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన లోకేశ్‌ కనగరాజ్-రజినీకాంత్‌ కాంబోలో రాబోతున్న ఆ మూవీ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: