![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/mahes-gunturukaram16b0f9d2-14e8-4c93-924b-71efc9834f0a-415x250.jpg)
ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్ కాబోతోంది అంటూ తెలియజేయడంతో అభిమానులు చాలా ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా థమన్, నాగ వంశీ హీరోయిన్ శ్రీలీల హింట్ ఇవ్వడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా అప్డేట్ వస్తుందని ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా సెకండ్ సింగిల్ సాంగ్ అప్డేట్ సైతం మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఇందులో మహేష్ బాబు బుగ్గ మీద శ్రీ లీల ముద్దు పెడుతూ ఒక పోస్టర్ని సైతం రిలీజ్ చేయడం జరిగింది.
ఈ పాట విషయానికి వస్తే ఓ మై బేబీ అనే సాంగ్ ప్రోమో డిసెంబర్ 11న సాయంత్రం నాలుగు గంటలకి విడుదల చేయబోతున్నామంటూ తెలియజేశారు.. అలాగే ఫుల్ సాంగ్ డిసెంబర్ 13న రిలీజ్ చేయబోతున్నామంటూ చిత్ర బృందం తెలియజేసింది. దీంతో మహేష్ అభిమానులు కాస్త ఆనందాన్ని తెలియజేస్తున్నారు.. ఈ చిత్రంలో మహేష్ బాబుకు మరదలి పాత్రలో కనిపించబోతోంది అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం వినిపిస్తోంది. కానీ ఇందులో ఈమె పాత్ర మరింత ఇంపార్టెంట్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇలా కాంబినేషన్లో ఈ పాట అదిరిపోయేలా ఉంటుందని రొమాంటిక్ సాంగ్స్ కూడా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఎందుకు సంబంధించి అప్డేట్ మాత్రం వైరల్ గా మారుతున్నది.