ఇటీవలే ఒక ఈవెంట్లో అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ బ్రహ్మాస్త్ర సీక్వెల్ తెలియజేయడం జరిగింది.. వాస్తవానికి మేము విడుదల తేదీని లక్ష్యంగానే నిర్ణయించుకున్నామని బ్రహ్మాస్త్రం మొదటి భాగం విడుదలైన తరువాత మూడు సంవత్సరాలకు పార్ట్ -2 విడుదల చేయాలనుకున్నాము.. అలాగే పార్ట్-2 విడుదల తేదీ 2025 దీపావళి బ్రహ్మాస్త్ర రెండవ భాగాన్ని విడుదల చేయాలని భావిస్తున్నామని తెలియజేశారు. 2026 లో క్రిస్మస్ మూడో భాగాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేశారు.. అయితే కచ్చితంగా ఇదే తేదీలలో విడుదల చేస్తామని తెలుపలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ అయితే జరుగుతోందని తెలిపారు.
పరిస్థితులను బట్టి మారవచ్చు.. మేము బ్రహ్మాస్త్ర -6 విడుదల తేదీలను సైతం ప్రకటించుకుంటామంటూ కూడా అయాన్ తెలియజేయడం జరిగింది. ఇటీవలే రణబీర్ కపూర్ కూడా యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు ఈ సినిమాతో మరొకసారి తన స్టామినా ఏంటో నిరూపించుకోవడం జరిగింది. ఇదే ఊపులోనే బ్రహ్మాస్త్ర సీక్వెల్న తెరకెక్కిస్తే మంచి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది మొదటిలో నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. మరి ఏ మేరకు బ్రహ్మాస్త్ర టు సినిమా ఆయన ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుందేమో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి