సింగర్ గా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది గీత మాధురి. ప్లే బ్యాక్ సింగర్ గా టాలీవుడ్ లో ఎంత మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక అలా సినీ ఇండస్ట్రీలో సింగర్ గా సక్సెస్ అయిన ఈమె నటుడు నందుని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఇక ఈ దంపతులకు ఇదివరకే దాక్షాయిని ప్రాకృతి అనే ఒక పాప కూడా ఉంది. కెరియర్ పరంగా భార్యాభర్తలిద్దరూ కూడా ఎప్పుడు బిజీగానే ఉంటూ ఉంటారు. నందు ప్రస్తుతం వరుస సిరీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. దాంతో పాటు పలు ఈవెంట్లకు కూడా హాజరవుతాడు నందు. ఇటు గీతా మాధురి సైతం

పలు సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. అలా ప్రస్తుతం గీత మాధురి నందు ఇద్దరు కూడా కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే తాజాగా గీతామాధురి తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ఒక గుడ్ న్యూస్ పంచుకుంది. అదేంటంటే ఇప్పటికే ఒక కూతురికి జన్మనిచ్చిన గీతామాధురి మరోసారి తల్లి కాబోతోంది అంటూ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఒక ఫోటోని సైతం షేర్ చేసింది. అలా ప్రస్తుతం గీత మాధురి షేర్ చేసిన

 ఈ ఫోటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా ఈమె తన ప్రేగ్నెన్సీ విషయాన్ని తెలియజేస్తూ తన కుమార్తె వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో అక్క కాబోతుంది అంటూ కామెంట్ చేశారు.ఇలా తన కుమార్తె అక్క కాబోతుంది అంటూ ఈమె తన ప్రేగ్నెన్సీ విషయాన్ని తెలియజేస్తూ తన భర్త కూతురుతో దిగిన ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ ఫోటోలలో గీత మాధురి బేబీ బంప్ క్లియర్ గా కనపడుతుంది. దీంతో ఈమె మరోసారి తల్లి కాబోతున్నారనే విషయాన్ని తెలుసుకున్నటువంటి అభిమానులు నటీనటులు ఈమెకు  శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: