ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ప్రభాస్ కొంత కాలం క్రితమే ఆది పురష్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాలు నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ప్రభాస్ "సలార్" మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

జగపతి బాబు , పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో కీలక పాత్రలో నటించగా ... రవి బుశ్రుర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 22 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించినట్లు సమాచారం. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు వారు "ఏ" సర్టిఫికెట్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఈ సినిమాలో భారీ రక్తపాతం ఉండడమే అని తెలుస్తుంది. భారీ రక్తపాతం ఉన్న నేపథ్యంలో సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమాకు "ఏ" సర్టిఫికెట్ ను జారీ చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: