తెలుగులో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువగా అభిమానించే బుల్లితెర నటులలో జ్యోతి రాయ్ కూడా ఒకరు.. ఈమె గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి గా నటిస్తోంది.. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఈమె సీరియల్స్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచిత్రాలు అయ్యింది. తెలుగు ఆడియన్స్ లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది సాంప్రదాయమైన చీరకట్టులో చాలా హుందాగా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా అబ్బురపరుస్తూ ఉంటుంది జ్యోతి రాయ్. ముఖ్యంగా గుప్పెడంత మనసు సీరియల్ లో కట్టు బొట్టుకు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.


అలా సీరియల్ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన జగతి గత కొద్ది రోజుల క్రితం ఈమె పాత్ర ముగిసేయడం జరిగింది. సీరియల్స్ లో ఎంతో పద్ధతిగా సాంప్రదాయంగా కనిపించిన జ్యోతి రాయ్ బయట పూర్తిగా భిన్నంగా మారిపోయి మోడ్రన్ లుక్ లో గ్లామర్ వాల్కబోస్తూ చిన్న చిన్న దుస్తులను కనిపిస్తూ కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తోంది. సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసేటువంటి ఫోటోలు వీడియోలు చూసి ప్రతి ఒక్కరు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఓటీటి లో వరుసగా దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం పలు రకాల వెబ్ సిరీస్లలో నటిస్తున్నట్లు తెలుస్తోంది జగతి.. ఇప్పుడు మరొక కొత్త వెబ్ సిరీస్ ని మొదలు పెట్టబోతోంది. అదే "నో మోర్ సీక్రెట్స్" అంటూ ఒక కొత్త వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయడం జరిగింది.ఈ ఫస్ట్ లుక్ లో బీచ్ ఒడ్డున చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని ఎవరికో లిప్ లాక్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. తన ఇంస్టాగ్రామ్ లో ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి వివరాలను రాసుకురావడం జరిగింది.. నో మోర్ సీక్రెట్స్ అని వెబ్ సిరీస్ గురించి తన ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలుగు హిందీ భాషలలో ఈ సిరీస్ విడుదల కాబోతోందని తెలియజేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: