నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా.. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్స్‌ గా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ డెవిల్.ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్‌ తో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 29న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌ పై అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పీరియాడిక్ జోనర్‌ లో తెరకెక్కుతుండడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు నుంచి యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంటల 26 నిమిషాలుగా రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు. డెవిల్ సినిమాపై అన్ని వైపుల నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తుండం తో సినిమా విడుదల కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తును్నారు. కళ్యాణ్ రామ్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను మెప్పించనున్నాయని మేకర్స్ చెబుతున్నారు. డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ కట్టిపడేస్తాయని అంటున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ ఆధ్వర్యంలో డెవిల్ చిత్రం కోసం సెట్‌ను వేసి.. ఓ ప్రత్యేకమైన లోకాన్ని క్రియేట్ చేశారు. సౌందర్ రాజన్ సినిమా టోగ్రఫీ తోడు కావటంతో విజువల్స్ నెక్ట్స్ రేంజ్‌లో ఉన్నాయని చిత్ర బృందం చెబుతోంది. తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరించగా.. శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించాడు.ఎవరికీ అంతు చిక్కని ఓ రహాస్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కళ్యాణ్‌ రామ్ నటిస్తున్నాడు. గతేడాది బింబిసార మూవీ తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న కళ్యాణ్‌ రామ్.. ఈసారి డెవిల్‌తో మరో సూపర్ హిట్ అందుకోవడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఈ మూవీని తెలుగుతోపాటు హిందీ, తమిళ్‌, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: