బాహుబలి సినిమా తరువాత  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇప్పుడు సలార్ తో తన రేంజ్ కి తగ్గ హిట్ సాధించారు. ప్రస్తుతం సలార్ దెబ్బకు బాక్సాఫీస్ అల్లాడిపోతోంది.బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర తిరగరాస్తూ వసూళ్ల మోత మోగిస్తోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ముందే అనుకున్నట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రికార్డు స్థాయిలో ఏకంగా రూ.175 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.నిన్న శనివారం, ఈరోజు ఆదివారంతో కలిపి బాలీవుడ్ లో కూడా ఖచ్చితంగా 100 కోట్ల షేర్ పైనే వసూలు చేస్తుంది.ఇక వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లో సలార్ సినిమా మూవీ భారీ ఓపెనింగ్స్ అందుకుంది.ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలుకొట్టింది.నైజాం ఏరియాలో సలార్ మూవీ నాన్ ఆర్ ఆర్ ఆర్ రికార్డును క్రియేట్ చేసింది. నైజాం ఏరియాలో మొదటి రోజు ఏకంగా 22.55 కోట్ల షేర్‌ ను రాబట్టింది సలార్.


మొత్తంగా నైజాం మార్కెట్‌లో ఈ సినిమా దుమ్ముదులిపేసింది.నైజాం ఏరియాలో 23.35 కోట్ల షేర్‌ తో టాప్ ప్లేస్‌ లో ఉంది ఆర్ ఆర్ ఆర్. ఇప్పుడు సలార్ సినిమా సెకండ్ ప్లేస్‌ లో నిలిచింది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఇమేజ్ అండ్ మార్కెట్ ను దృష్టిలో చూస్తే ప్రభాస్ సోలోగానే వచ్చి ఇలా అద్భుతం చేసి చూపించారనే చెప్పాలి. సలార్‌ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ వీకెండ్ లో ఇంటా బయట ఖచ్చితంగా మరిన్ని రికార్డులు సెట్ చేయడం పక్కా. ఇక నార్త్ అమెరికాలో సలార్ సినిమా దుమ్మురేపుతోంది. కళ్లు చెదిరే వసూళ్లను సలార్ రాబడుతోంది. ప్రీమియర్స్, డే 1 కలిపి ఏకంగా 3.8 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. నాలుగు మిలియన్ల డాలర్ల మార్కుకు అతి చేరువలో ఉంది. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి కూడా మెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: