అందుకే ఎప్పటి లాగానే ఇప్పుడు కూడా లాజిక్ లేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో క్రాస్ చెకింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పుష్ప 2 సినిమా ఫైనల్ ఔట్ పుట్ చూసాక, సుక్కు కొన్ని లాజిక్ లేని సీన్లు గుర్తించినట్లు సమాచారం. వాటిని ఇప్పుడు మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాలు మార్చడానికి సుకుమార్ బాగానే కష్టపడుతున్నట్లు టాక్. ఇకపోతే ఆగస్టు 15న పుష్ప -2 సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పుడే అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా ఈ శుభవార్తను అభిమానులకు అందజేశారు.ప్రస్తుతం మూవీకి సంబంధించి మిగిలిపోయిన పనులు అన్నిటినీ త్వరగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమై చివరి దశకు చేరుకున్నట్లు సినిమా వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఈ సినిమాతో సుకుమార్ రాజమౌళి లాగా హై రేంజ్ కి వెళ్తాడో, లేదంటే మామూలు హిట్ తో సరిపెట్టుకుంటాడో చూడాలి. ఈ సినిమా హిట్ అయితే అల్లు అర్జున్ కూడా వేరే రేంజ్ కి వెళ్ళిపోతాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి