ప్రస్తుత తరం మీడియం రేంజ్ హీరోలలో మంచు విష్ణు చాల సీనియర్. మంచు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఈపాటికి ఈతరం ప్రేక్షకులు అతడిని ఎప్పుడో మరిచిపోయి ఉండేవారు. వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న మంచు విష్ణు తన కెరియర్ కు సంబంధించి ఎవరు ఊహించని సాహసం చేస్తున్నాడు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో అతడు లేటెస్ట్ గా నిర్మిస్తూ నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది.సహజత్వం కోసం విష్ణు సుమారు 600 మంది క్రూ ను వెంటపెట్టుకుని న్యూజీలాండ్ దేశంలో షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టూడియోలో ఈమూవీ షూటింగ్ ను పరుగులు తీయిస్తున్నాడు. ఈమధ్యనే జరిగిన సంక్రాంతి పండుగ రోజున ఈ మంచు వారి హీరో సోషల్ మీడియాలో తన అభిమానులు అందరితోను ఛాట్ చేశాడు. ఈ చాటింగ్ లో అతడికి ఎదురైన ఒక ప్రశ్న మంచు విష్ణు మనసును గాయపరిచిందట.ముఖేష్ కుమార్ సింగ్ అనే హిందీ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ గురించి ఒక అభిమాని ప్రశ్నిస్తూ ఈ మూవీ మైథాలజీ అనడం తనకు బాధ కలిగించిందని అంటున్నాడు. మైథాలజీ అంటే హిస్టారికల్ గా ప్రూఫ్ లేనిది అనిఅర్థం. అయితే ‘కన్నప్ప’ అలాంటి సినిమా కాదని మంచు విష్ణు అభిప్రాయ పడుతున్నాడు. నాసా వాళ్లు కూడ రామసేతు ఉందని అభిప్రాయ పడుతుంటే  చాలామంది మన ఘన చరిత్రను నమ్మరని కన్నప్ప గురించి ఎన్నో పురాణాలలో ఉన్న విషయాలను గుర్తుకు చేస్తున్నాడు.అంతేకాదు కన్నప్ప చరిత్ర సత్యమని దీనికి ఎన్నో ఆధారాలు ఉన్నాయని అంటూ శ్రీకాళహస్తీశ్వరాలయం లోని వాయు లింగం మహిమ అందరికీ తెలిసిన విషయమే అని అంటున్నాడు. ‘కన్నప్ప’ మూవీలో దక్షిణాదిలో పేరున్న నటీనటులు అంతా నటిస్తున్నారు. అలనాటి కృష్ణంరాజు ‘భక్తకన్నప్ప’ మూవీని మారిపించే విధంగా తన మూవీ ఉండాలని మంచు విష్ణు ఆశ..


మరింత సమాచారం తెలుసుకోండి: