తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సుహాస్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ నటుడు కలర్ ఫోటో అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. ఈ మూవీ ద్వారా ఈ నటుడి కి అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలు లభించింది. 

ఆ తర్వాత నుండి సుహస్ కి తెలుగు సినీ పరిశ్రమలో హీరో అవకాశాలు మరియు విలన్ అవకాశాలు ఫుల్ గా దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటుడు రైటర్ పద్మభూషణ్ అనే సినిమాలో హీరో గా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే హిట్ ది సెకండ్ కేస్ అనే సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించి కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఈ నటుడు తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ఆహా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుండి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: