ఒకానొక సమయంలో తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన ప్రియమణి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ జగపతి బాబు హీరో గా రూపొందిన పెళ్లయిన కొత్తలో అనే మూవీ తో మంచి విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన యమదొంగ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. దానితో ఈమె తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థాయి కి వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత ఈమెకు తెలుగు తో పాటు అనేక తమిళ సినిమాలలో కూడా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ,  కోలీవుడ్ ఇండస్ట్రీ లలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమెకు చాలా వరకు అవకాశాలు తగ్గాయి. తాజాగా ప్రియమణి "భామా కలాపం 2" అనే సినిమాలో నటించింది.

మూవీ నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ప్రియమణి మాట్లాడుతూ ... ఎన్టీఆర్ హీరో గా రూపొందిన యమదొంగ సినిమా నా కెరియర్ లో ఓ గొప్ప అనుభూతి. ఆ సమయంలో ఎన్టీఆర్ తో కలిసి నటించడం నాకు గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. మరోసారి ఎన్టీఆర్ తో ఇంకో సినిమా చేయాలని ఉంది. అవకాశం వచ్చే కచ్చితంగా ఎన్టీఆర్ తో సినిమా చేస్తాను అని ప్రియమణి తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: