తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ తాజాగా గామీ అనే వైవిధ్యమైన సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి విద్యదర్ దర్శకత్వం వహించగా ... కలర్ ఫోటో సినిమాతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటిమని చాందిని చౌదరి ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ని మార్చ్ 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. 

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన మూడు నిమిషాలకు పై బడిన ఒక భారీ ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం ... అలాగే ఈ ట్రైలర్ లో గ్రాఫిక్స్ వర్క్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఒక్క సారిగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ గా పెరిగి పోయాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మార్చి 8 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs