టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... పరుశు రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గోపి సుందర్ సంగీత సారధ్యం లో  రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తు న్నాడు . 

ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు . ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడం తో ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది . ఇక పోతే ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబం ధించిన డిజిటల్ హక్కులను కూడా ఓ ప్రముఖ సంస్థ కు అమ్మి వేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

ఈ చిత్ర బృందం వారు ఇప్పటికే ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" సంస్థ కు భారీ ధరకు అమ్మి వేసినట్లు తెలుస్తుంది . అందు లో భాగంగా ఈ సిని మా విడుదల అయిన కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd