దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బాగా బిజీగా ఉండడంతో గేమ్ చేంజర్ సినిమా పనులు చాలావరకు ఆలస్యంగా ఫినిష్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా  నుంచి అప్డేట్స్ ఎప్పుడు వదులుతారా అనే విషయంలో చాలా కాలం నుంచి అభిమానుల్లో సస్పెన్స్ కొనసాగింది.అయితే అందుకు కారణం సినిమా షూటింగ్ అనుకున్నా ప్లాన్ కు తగ్గట్టుగా పూర్తి కాకపోవడమే.రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చిన తర్వాతనే సినిమా అప్డేట్స్ ఒకదాని తర్వాత మరొకటి ఇవ్వాలి అని మూవీ టీం అనుకున్నారు. ఇక మొత్తానికి నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఒక పాటను విడుదల చేశారు. జరగండి జరగండి.. అనే ఈ పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రామ్ చరణ్ - కియార అద్వానీ జోడి మాస్ లుక్స్ తో చాలా స్టైలిష్ గా స్టెప్పులు వేశారు. శంకర్ మార్క్ కు తగ్గట్టుగా సెట్ వర్క్ కూడా హైలెట్ అయ్యింది.ఎస్ ఎస్ తమన్ కంపోజ్ చేసిన ఈ పాటను దలేర్ మెహింది, సునీత చౌహన్ పాడారు.అయితే గతంలోనే ఈ పాట సోషల్ మీడియాలో లీక్ అయిన విషయం తెలిసిందే. 


అయితే అప్పుడు వేరే సింగర్స్ తో పాడించిన థమన్ ఇప్పుడు మాత్రం ఇండియాలో టాప్ సింగర్స్ చేత పాడించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి గేమ్ చేంజర్ నుంచి పాట రూపంలో అప్డేట్ మెగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కామన్ ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.ఈ రోజుల్లో ఏ సినిమాకైనా సరే ముందుగా పాటలు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తేనే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అంతేకాకుండా టీజర్ ట్రైలర్ కూడా సినిమా బిజినెస్ కు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలుస్తూ ఉన్నాయి. కాబట్టి రాబోయే అప్డేట్స్ ఖచ్చితంగా మరింత బలంగా ఉండాలి.అయితే గేమ్ ఛేంజర్ సినిమా విడుదల డేట్ పై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇస్తారని ఫ్యాన్స్ అందరు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. కానీ దిల్ రాజు ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదని అర్థం అవుతుంది. అనుకున్నట్లు జరిగితే మాత్రం ఈ ఏడాది సమ్మర్ తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: