మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాలో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఈ సంవత్సరం దీపావళి పండగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు వార్త వైరల్ అవుతుంది . ఈ సినిమా తర్వాత చరణ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం లో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు . ఇప్పటికే ఈ మూవీ అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కూడా అయ్యింది.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఝాన్సీ కపూర్ హీరోయిన్ గా కనిపించనుండగా ... కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్మూవీ లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు . ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనుండగా ... ఈ సినిమాని మైత్రి సంస్థ వారు నిర్మించనున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఓ కేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి అమితా బచ్చన్ కూడా నటించబోతున్నట్లు ... అమితా అబ్ పాత్ర ఈ సినిమాలో చాలా తక్కువ సమయమే ఉన్నప్పటికీ ఈ సినిమా కథ మొత్తాన్ని మలుపు తిప్పే పాత్రగా అది ఉండబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే బుచ్చిబాబు ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ రెహమాన్ ఇప్పటికే ఈ సినిమాకు మూడు పాటలను అందించాడు అని అవి సూపర్ గా ఉన్నట్లు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rc