టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించిన శేఖర్ మాస్టర్ ఇంట తాజాగా విషాదఛాయలు చోటుచేసుకున్నాయి.. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్టుని షేర్ చేయడం జరిగింది.. శేఖర్ మాస్టర్ ఇలా షేర్ చేస్తూ "ఎంతో బాధను అనుభవించావు.. ధైర్యంగా నిలబడ్డావు.. నువ్వే నాకు ధైర్యాన్ని ఇచ్చావు..ఇప్పుడు నువ్వు లేని వార్త అసలు జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ శేఖర్ మాస్టర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు". ఈ విషయం విని అభిమానులు అందరూ కూడా ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు.


పలువురు అభిమానులు శేఖర్ మాస్టర్ కుటుంబంలో అసలు ఏం జరిగిందనే విషయం పైన ఆరా తీయగా.. అసలు విషయంలోకి వెళ్తే శేఖర్ మాస్టర్ వదిన గడిచిన కొన్ని గంటలకు క్రితం మరణించినట్లు తెలుస్తోంది. ఇమే మరణానికి గల కారణాలను మాత్రం శేఖర్ మాస్టర్ తెలియజేయలేదు.. కేవలం సోషల్ మీడియాలో వదిన మిస్ యూ అంటూ పోస్ట్ షేర్ చేయడం జరిగింది.. అంతేకాకుండా తన వదిన లేని వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ కామెంట్స్ చేశారు.


శేఖర్ మాస్టర్ పోస్ట్ కి సైతం స్టార్ యాంకర్ విష్ణుప్రియ కూడా కామెంట్స్ చేయడం జరిగింది.. ఓం శాంతి అంటూ అభిమానులు నేటిజెన్స్ కూడా స్పందిస్తున్నారు. శేఖర్ మాస్టర్ వదిన ఆత్మకు శాంతి చేకూరాలంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ సినీ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం బుల్లితెర పైన ప్రసారమయ్యేటువంటి డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే తన కుటుంబంతో కలిసి పలు రకాల వీడియోలు కూడా చేస్తూ షేర్ చేస్తూ ఉంటారు శేఖర్ మాస్టర్.. అలాగే యూట్యూబ్ లో కూడా పలు రకాల షార్ట్ ఫిలిమ్స్ లను కూడా షేర్ చేస్తూ ఉంటారు. స్టార్ హీరోల చిత్రాలకు కూడా కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు శేఖర్ మాస్టర్. అందుకు సంబంధించి పోస్ట్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: