సినిమా ఇండస్ట్రీ లో ఏ జంట నటించిన సినిమా మంచి సక్సెస్ అవుతుందో వారితో మరో సినిమా తీయడానికి అనేక దర్శక , నిర్మాతలు పోటీ పడుతూ ఉంటారు. అప్పటికే వారిద్దరి జంటకు పరీక్షకుల నుండి మంచి ప్రశంసలు వచ్చి ఉన్నట్లు అయితే ఈజీగా నెక్స్ట్ మూవీ లో కూడా ప్రేక్షకులు వారితో పాత్రలతో ఈజీగా కనెక్ట్ అవుతారు. దానితో ఆ సినిమాకు విజయ అవకాశాలు కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి.

ఇకపోతే కొంత కాలం క్రితం శ్రీ విష్ణు హీరో గా రెబ మౌనిక జాన్ హీరోయిన్ లుగా సామజ వర గమన అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అలాగే ఈ సినిమాలో హీరో , హీరోయిన్ లుగా నటించిన శ్రీ విష్ణు , రేబా మౌనిక జాన్ జంటకు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే ప్రస్తుతం వీరి కాంబోలో మరో మూవీ రూపొందుతుంది.

ప్రస్తుతం శ్రీ విష్ణు హీరో గా రేబా మౌనిక జాన్ హీరోయిన్ గా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తూ ఉండగా ... లైట్ బాక్స్ మీడియా , పిక్చర్ ఫర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ మూవీ దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడం అలాగే ఈ సినిమాకు సంబంధించిన 60% షూటింగ్ కూడా పూర్తి కావడం జరిగినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు అలాగే కొన్ని విషయాలను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో శ్రీ విష్ణు నటించిన సినిమాలు వరుసగా విజాయలను సాధిస్తూ ఉండడంతో ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sv