టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటిమని అంజలి 2014 వ సంవత్సరంలో గీతాంజలి అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ హర్రర్ కామెడీ జోనర్ మూవీ ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇక గీతాంజలి మూవీ వచ్చిన తర్వాత దాదాపు పది సంవత్సరాలకు ఈ మూవీ కి సీక్వెల్ గా "గీతాంజలి మళ్లీ వచ్చింది" అనే మూవీ ని రూపొందించారు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యింది. మరి ఈ సినిమాకు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే ఇంకా కలెక్షన్ లను రాబట్టాలి అనే విషయాలను తెలుసుకుందాం.

ఇప్పటి వరకు "గీతాంజలి మళ్లీ వచ్చింది" సినిమాకు సంబంధించిన 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యింది. ఈ 7 రోజుల్లో కలిపి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 40 లక్షల కలెక్షన్ లు దక్కగా ... మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కలిపి 45 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 85 లక్షల షేర్ ... 1.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇక 7 రోజుల్లో ఈ సినిమాకు కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 30 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 7 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 1.15 కోట్ల షేర్ ... 2.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి దాదాపుగా 2.5 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. దానితో ఈ మూవీ మరో 1.5 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: