హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అమీర్ ఖాన్ తాజాగా కపిల్ షో కి వచ్చాడు. అందులో భాగంగా ఈయన అనేక ఆసక్తికరమైన విషయాలను ఈ షో లో పంచుకున్నారు. ఇకపోతే అమీర్ ఖాన్ కొన్ని సంవత్సరాల క్రితం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన గజిని అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొదట సూర్య హీరోగా ఆసిన్ , నయన తార హీరోయిన్ లుగా గజిని అనే పేరుతో తమిళ్ లో రూపొందింది.

ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయగా ఈ మూవీ అటు తమిళ్ , ఇటు తెలుగు రెండు ఇండస్ట్రీ లలో కూడా అద్భుతమైన విజయం సాధించింది. దానితో మురగదాస్ ఈ సినిమాను అదే టైటిల్ తో అమీర్ హీరోగా హిందీలో రూపొందించాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం అందుకొని ఆ సమయం లోనే 100 కోట్లకి కైగ నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇక తాజాగా కపిల్ షో లో భాగంగా అమీర్ ఖాన్ "గజినీ" సినిమా దర్శకుడు అయినటువంటి మురుగదాస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

తాజాగా అమీర్ ఖాన్ , కపిల్ షో లో మాట్లాడుతూ ... మురుగదాస్ ఎటువంటి ఫిల్టర్‌లు లేని ప్రత్యేకమైన వ్యక్తి. ఒక సన్నివేశానికి సంబంధించి మనం అతనికి కొన్ని సలహాలు చెబితే అవి విని అతను ఎటువంటి ఫిల్టర్లు లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆ ఐడియా కనుక నచ్చకపోతే చాలా బ్యాడ్ అని ఏ మాత్రం సంకోచం లేకుండా చెబుతాడు. అవతలి వ్యక్తి చెడుగా భావిస్తే అతను దానిని ఏమాత్రం పట్టించుకోడు. అలాగే అతను ఎవరితో మాట్లాడుతున్నాడో కూడా ఆలోచించడు. మురుగదాస్ ఆలోచన నచ్చితే , అతను సూపర్ హిట్ సార్ అంటాడు. మీరు చూడండి అతనికి ఇక్కడ ఫిల్టర్ కూడా లేదు. ఇది నేను అతని నుండి స్వీకరించిన గుణం అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: