‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ సినిమాలు ఎవరు ఊహించని స్థాయిలో బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడంతో విజయ్ దేవరకొండ టాప్ హీరోల లిస్టులో చెరిపోతాడని అంచనాలు వచ్చాయి. అయితే ఆతరువాత వరసగా విడుదలైన సినిమాలు విజయ్ కెరియర్ గ్రాఫ్ ను పెంచలేక పోవడంతో ఈ యంగ్ హీరో టాప్ హీరోల జాబితాలో చెరలేకపోయాడు.



విజయ్ దేవరకొండ తన సినిమా కథల ఎంపికలో చేసిన కొన్ని పొరపాట్లు వల్ల అతడిని అపజయాలు వెంటాడాయి అన్న అభిప్రాయం ఇండస్ట్రీలో చాలామందికి ఉంది. లేటెస్ట్ గా విడుదలైన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ హిట్ అవ్వనప్పటికీ ఈ యంగ్ హీరోకు వచ్చే అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య విజయ్ నటించబోయే మరో లేటెస్ట్ మూవీ అనౌన్స్ మెంట్ అభిమానులకు జోష్ ను కలిగించింది. రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ప్యాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు.



మూవీ కథ 19వ శతాబ్ద కాలానికి సంబంధించినది అన్న లీకులు వస్తున్నాయి. ఒక శాపగ్రస్తమైన నేలను బ్యాక్ డ్రాప్ గా తీసుకుని ఒక డిఫరెంట్ కథ తీయబోతున్నారు. ఈ కథ వైయిలెంట్ డ్రామాగా ఉంటుందని లీకులు వస్తున్నాయి. యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ‘కత్తి నేనే నెత్తురు నాదే యుద్ధం నాతోనే’ అంటూ పెట్టిన క్యాపక్షన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.



ఈసినిమాతో పాటు గౌతమ్ తిన్ననూరి దర్శత్వంలో విజయ్ రస్టిక్ డ్రామాలో నటించబోతున్నాడు. ఈ రెండు సినిమాల కథలు చాల డిఫరెంట్ గా ఉండటంతో ఈ రెండు విజయ్ కు అతడు కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ ను అందడించే ఆస్కారం ఉంది అన్న అంచనాలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలలో ఏదో ఒక సినిమా విజయ్ దేవరకొండ కోరుకున్న 200 కోట్ల కలక్షన్స్ కలను నెరవేరుస్తుందేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: