ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ కొన్ని సినిమాలకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అందులో భాగంగా ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

ఫైటర్ : హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో మాత్రం ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది. ఈ సంవత్సరం ఇప్పటికే ఈ సినిమాకి నెట్ ఫ్లిక్స్ లో 14 మిలియన్ వ్యూస్ దక్కాయి.

లాపట లేడీస్ : ఈ మూవీ కి ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో 13.8 మిలియన్ వ్యూస్ దక్కాయి.

యానిమల్ : రన్బీర్ కపూర్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో 13.6 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇక థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సైతాన్ : బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ మూవీ కి ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో 13 మిలియన్ వ్యూస్ దక్కాయి.

డంకి : షారుక్ ఖాన్ హీరో గా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో 10.8 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని తాప్సి కీలకమైన పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: