టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా చాలా సంవత్సరాల పాటు కెరియర్ ను కొనసాగించిన మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. నవీన్ చంద్ర ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... సుమన్ చిక్కాల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 

మూవీ ని మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించి చాలా రోజులు అవుతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను జోరుగా కొనసాగిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా రేపు ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించనున్నట్లు దానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రానున్నట్లు కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇలా ఈ సినిమా ప్రచారాలు ఫుల్ జోష్ లో జరుగుతున్న నేపథ్యంలో ఈ మూవీ కచ్చితంగా మే 31 వ తేదీన విడుదల అవుతుంది అని అంతా భావించారు. అలాంటి సమయం లోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ మార్చి వేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను మే 31 వ తేదీన విడుదల చేయడం లేదు అని , జూన్ 7 వ తేదీన విడుదల చేయబోతున్నాం అని తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన ఓ పోస్టర్ లో కాజల్ పోలీస్ యూనిఫామ్ వేసుకొని చేతిలో గన్ పట్టుకొని ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ పోస్ట్ పోన్ కావడంతో ఈ మూవీ బృందం వారు రేపు జరపవలసిన ట్రైలర్ ఈవెంట్ ను నిర్వహిస్తారో ... లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: