టాలీవుడ్ లో మహేష్ నమ్రతాల  కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అతి చిన్న వయసులోనే సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని పలు రకాల వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా సితారకు సినిమాలంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు. తన తండ్రి నటించే సినిమాలలో కచ్చితంగా ఏదో ఒక పాటకు రీల్స్ చేస్తూ ఉంటుంది సితార. సితార ఎన్నో  సేవా కార్యక్రమాలను కూడా చేపడుతూ ఉంటుంది. ఇలాంటి సితార ఇప్పుడు ఏం చదువుతోంది అనే విషయం తెలుసుకోవడానికి పాత్ర పడుతున్నారు.


ప్రస్తుతం సితార ఆరవ తరగతి నుంచి ఏడవ తరగతికి  వెళ్లబోతోంది. ఇటీవలే ఒక జ్యువెలరీ యాడ్ ను కూడా చేసింది సితార. ఈ యాడ్ చూసిన తర్వాత సితార రాబోయే రోజుల్లో ఖచ్చితంగా స్టార్ స్టేటస్ ని అందుకుంటుందని అభిమానం సైతం భావిస్తున్నారు. మరి మహేష్ బాబు వారసత్వాన్ని సితార ఇండస్ట్రీలో కొనసాగిస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది. సితార చిన్న వయసులోనే ఎన్నో చారిటీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజనులకు స్వచ్ఛమైన ప్రేమతో ఎన్నో పనులను కూడా చేస్తూ ఉంటుంది సితార.


అలాగే తన తండ్రి బాటలోనే ఎంతోమందికి ఉచితంగా సేవా కార్యక్రమాలు చేయాలని కూడా ఆలోచిస్తూ ఉంటుంది మహేష్ బాబు కూడా ఇప్పటికే ఎంతోమందికి గుండె ఆపరేషన్లను సైతం చేయించారు. సితారకు సపరేటుగా ఒక యూట్యూబ్ ఛానల్ తో పాటు సోషల్ మీడియాలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి హీరోలుగా చాలామంది ఎంట్రీ ఇచ్చినప్పటికీ హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడానికి ఎవరు మక్కువ చూపలేదు మరి సితార ఆయన హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుందేమో చూడాలి మరి. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి తో భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: