మహేష్ బాబు కు తన సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఏదో తెలిస్తే మతి పోతుంది. ఆ విషయం రీసెంట్ గా తెలియచేసారు.సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ అనతికాలంలోనే స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే.తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. అనవసరమైన వివాదాల జోలికి పోకుండా ఎంతవరకూ ఉండాలో అంతవరకే ఉంటూ తన సినిమాలు తాను చేసుకుంటూ అభిమానులను అలరిస్తున్నాడు. ఆయన సినిమా హిట్ అయినా ఫ్లాఫ్ అయినా ఫ్యాన్స్ కు బాగానే నచ్చుతాయి. ఆ సినిమాల్లో మహేష్ నటనను మెచ్చుకోకుండా ఉండలేరు. అలాగే మహేష్ అభిమానులు తమ హీరో సినిమాల్లో తమకు బాగా నచ్చినవి చెప్తూంటారు. మరి మహేష్ బాబు కు తన సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఏదో తెలిస్తే మతి పోతుంది. ఆ విషయం రీసెంట్ గా తెలియచేసారు.నాకు చాలా నచ్చిన సినిమా నిజం . అలాంటి గొప్ప చిత్రాన్ని నాకు అందించినందుకు దర్శకుడు తేజకు థ్యాంక్స్‌ చెప్పాలి. 'నిజం' చేసినందుకు ఇప్పటికీ గర్వపడుతుంటాను అని చెప్పి షాక్ ఇచ్చారు. ఎందుకంటే నిజం చిత్రం డిజాస్టర్ అయ్యింది.మహేష్ బాబు హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నిజం'. 'చిత్రం' 'నువ్వు నేను' 'జయం' వంటి చిత్రాల తర్వాత తేజ దర్శకత్వంలో రూపొందిన మూవీ కావడం.. అలాగే 'ఒక్కడు' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ కావడంతో 'నిజం' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విజయాన్ని సాధించలేదు. మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది 'నిజం'. అయితే ఈ సినిమా తనకు బాగా ఇష్టం అంటున్నారు మహేష్ బాబు.అలాగే నిజం మూవీని 'చిత్రం మూవీస్' బ్యానర్ పై స్వయంగా తేజ నిర్మించడం జరిగింది. రిలీజ్ కు ముందు ఈ సినిమా ఆయనకు మంచి బిజినెస్ చేసింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోవడానికి కారణం.. 'ఒక్కడు' తర్వాత మహేష్ ఇమేజ్ పెరగడం అని తేజ ఓ సందర్భంలో చెప్పాడు.

 
తాను 'బాబీ' సినిమా చూశాక 'నిజం' చిత్రానికి మహేష్ బాబుని హీరోగా అనుకున్నాడట. అప్పటికి 'ఒక్కడు' ఇంకా ప్రారంభం కాలేదు. నిజానికి 'ఒక్కడు' కంటే 'నిజం' ముందుగా రావాల్సిన మూవీ. ఇక 'నిజం' షూటింగ్ డిలే అవ్వడంతో 'ఒక్కడు' ముందుగా వచ్చింది. అయితే 'నిజం' ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కమర్షియల్ గా మాత్రం మంచి హిట్ అని దర్శకుడు తేజ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. 'నిజం' చిత్రం తన గత సినిమాలలానే రూ.10 కోట్ల పైనే వసూళ్లు రాబట్టిందట. కానీ అందరూ ఈ సినిమా ప్లాప్ అని చెప్పుకుంటారు కానీ కమర్షియల్ గా మాత్రం మంచి సక్సెస్ అందుకున్న సినిమా ఇది అంటూ తేజ చెప్పుకొచ్చారు.కేవలం 7 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్లు సైతం భారీగానే వచ్చాయి.నిజం సినిమాకు ముందు తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో సంబరం మినహా మిగిలిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో నిజం సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరిచారు. మహేష్ బాబు పాత్ర చిత్రణ సరిగ్గా లేదని మెజారిటీ ప్రేక్షకులు భావించారు.నిజం సినిమాలో హీరో తన తల్లి సహకారంతో మాత్రమే హీరో అన్ని పనులు చేస్తుండటం, కథ, కథనంలోని లోపాలు, ప్రకాష్ రాజ్ పాత్రకు అతిగా ప్రాధాన్యత ఉండటం, ఇతర కారణాల వల్ల సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది.రాశి పాత్ర కూడా సినిమాకు మైనస్ అయింది.ఇక ఈ సినిమాలోని నటనకు మహేష్ బాబుకు, తాళ్లూరి రామేశ్వరికి అవార్డులు వచ్చాయి.ఒక్కడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మహేష్ బాబుకు నిజం సినిమా ఫలితం తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. అయితే ఆ తర్వాత తేజతో మరో సినిమా చేయలేదు మహేష్ బాబు.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా కమిటయ్యారు మహేష్ .ఆ సినిమా గురించి రాజమౌళి మాట్లాడుతూ... "నా నెక్స్ట్ మూవీ మొదలైంది. ఇప్పటికే స్క్రిప్ట్ పని పూర్తయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కానీ ఇంకా క్యాస్టింగ్ పూర్తి కాలేదు. కేవలం హీరోను మాత్రమే సెలక్ట్ చేశాం. ఆయన పేరు మహేష్ బాబు.. తెలుగు యాక్టర్. మీలో చాలా మందికి ఆయన తెలుసు అనుకుంటా. మహేష్ చాలా అందగాడు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి రిలీజ్ టైమ్‌లో మహేష్‌ను ఇక్కడికి తీసుకువచ్చి మీ అందరికీ పరిచయం చేస్తాను." అంటూ రాజమౌళి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: