మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం లక్కీ భాస్కర్ అనే స్ట్రేట్ తెలుగు సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తూ ఉండగా , మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ మూవీ ని సెప్టెంబర్ 27.వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా ఆల్మోస్ట్ ఈ తేదీన విడుదల కాపడం కష్టం అని తెలియడంతో లక్కీ భాస్కర్ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర మూవీ ని మొదట అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వారు ప్రకటించారు. కానీ ఈ సినిమా పనులు అంతకంటే ముందే పూర్తి కానున్న నేపథ్యంలో ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దానితో లక్కీ భాస్కర్ యూనిట్ ఆ తేదీన కాకుండా వేరే తేదీన ఈ సినిమాను విడుదల చేయాలి అని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన పనులు అప్పటి వరకు పూర్తికావు అని దానితో ఈ సినిమా పోస్ట్ పోన్ కానుంది అని వార్తలు వస్తున్నాయి  దానితో లక్కీ భాస్కర్ యూనిట్ ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన కాకుండా అంతకుముందే అక్టోబర్ 15 వ తేదీనే విడుదల చేయాలి అని ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే మరో 20 రోజుల్లో లక్కీ భాస్కర్ షూటింగ్ మొత్తం పూర్తి కాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: