దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  సాధారణంగా ఏదైనా సినిమా విడుదలైనప్పుడు ఏదో ఒక వర్గం ప్రేక్షకులకు ఆ సినిమా బాగా నచ్చేస్తూ ఉంటుంది  కానీ రాజమౌళి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ సాధిస్తూ ఉంటుంది. ఇక కేవలం ప్రేక్షకులను మెప్పించడమే కాదు.. నిర్మాతలకు లాభాల పంట పండిస్తూ ఉంటుంది. అదే సమయంలో అటు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు అన్నింటినీ కూడా తుడిచి పెట్టేస్తూ ఉంటుంది.


 ఇలా ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఇక జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాల్లో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని మహా మహా స్టార్ హీరోలు సైతం కోరుకుంటూ ఉంటారు. రాజమౌళి సినిమాలో ఒక పాత్రలో నటించారు అంటే చాలు ఇక వారికి ఊహించని రేంజ్ లో గుర్తింపు వస్తూ ఉంటుంది. అయితే తనకు కూడా ఇలా రాజమౌళి సినిమా కారణంగానే ఒక్కసారిగా గుర్తింపు వచ్చేసింది అంటూ చెప్పుకొచ్చాడు ఒక నటుడు. ఆయన ఎవరో కాదు దేవ్ గిల్.


 అదేనండి రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమాలో రణదేవ్ బిల్లాగా నటించి తన విలనిజంతో ఆకట్టుకున్న నటుడు. ఇటీవలే ఒక సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దర్శకధీరుడు రాజమౌళి వల్లే నటుడిగా నాకు మంచి గుర్తింపు వచ్చింది. 15 ఏళ్ళ క్రితమే ఆయన దర్శకత్వంలో నటించే ఛాన్స్ రావడం అదృష్టం అంటూ చెప్పుకొచ్చాడు  అహో విక్రమార్క టీజర్ లాంచ్ ఈవెంట్లో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ కొత్త సినిమాతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. హీరో రామ్ చరణ్ తనకు స్ఫూర్తిగా ని తెలిపాడు. మరోసారి అవకాశం వస్తే రాజమౌళి సినిమాలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నాను అంటూ దేవ్ గిల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: