చాలామందికి ఎంత చదివినా గుర్తు ఉండదు. చదివి చదివి తలనొప్పి వస్తుంది గాని గుర్తు ఉండదు. అలా కాకుండా చదివింది గుర్తుండటం లేదా? ఇవి తినాల్సిందే అయితే! స్టూడెంట్స్ తో పాటు ప్రభుత్వం ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారు చదివింది గుర్తుంచుకోవటం చాలా అవసరం. అయితే కొందరు కొన్ని రోజుల్లోనే చదివింది మర్చిపోయి ఇబ్బంది పడుతుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలను డైట్ లో చేర్చుకోవడం మంచిది. అవేంటో తెలుసుకుందాం. రెడ్ ద్రాక్ష పండ్లు, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో దోహదపడతాయి. ఈ ద్రాక్ష పండు లోని వీటిలోని పాలీఫినాల్స్ మెదడును చురుగ్గా చేసి చదివింది గుర్తుండేలా ప్రోత్సాహిస్తాయి.


బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, స్ట్రాబెరీ ఆంటీ బెర్రీ పండ్లు చదివింది గుర్తుండటంలో ప్రభావంతంగా సహాయపడతాయి. వీటిలోని అంథోసయానిన్న, పాలీ ఫినాల్స్ మెదడును చురుగ్గా మారుతాయి. మెదడును చురుకుగా ఉంచడంలో ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్స్ దోహదపడతాయి. అందువల్ల ఇవి ఎక్కువగా లభించే సాల్మోన్, మాకరెల్, సార్డైన్స్ వంటి కొవ్వు చేపలు తినటం మేలు. బాదం, జీడిపప్పు, వాతనట్స్, పిస్తా, ఎండు ద్రాక్ష వంటి గింజలను తినటం చాలా మంచిది. వీటిలో ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్స్ తో పాటు సెలీనియం, రాగి, మాంగనీస్ వంటి అవశ్యక పోషకాలు ఉంటాయి. ఇది ఏకాగ్రతను పెంచుతాయి. బ్రౌన్ రైస్ తినటం వల్ల మొదు చురుగ్గా ఉంటుంది.


దీనిలోని పోషకాలు మెదడుకు ప్రసరణ మెరుగు పరుస్తాయి. ఏకాగ్రత కూడా పెరుగుతుంది. చదువుకునేవారు ప్రతిరోజు కోడిగుడ్డు తినటం మంచిది. ఎగ్స్ లోని కోలిన్ అని సమ్మేళనం సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడతాయి. తద్వారా మొదడు చురుకుగా ఉంటుంది. జీర్ణ క్రియ రేటు సక్రమంగా జరగడానికి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడానికి బ్రేక్ ఫాస్ట్ తినటం చాలా అవసరం. అందువల్ల చదువుకునే వారు ప్రతి రోజు అల్పాహారం తినటం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండాలన్న, మెదడు చురుకుగా పనిచేయాలన్నా హైడ్రేట్ గా ఉండటం అవసరం. దీనికోసం రోజు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపర్చి మెదడును చురుకుగా ఉంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: