తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి రామ్ పొతినేని ఆఖరుగా స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే రామ్ తాజాగా కొంత కాలం క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన డబుల్ ఇస్మార్ట్ సినిమాలో హీరో గా నటించాడు. 

కావ్య దాపర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... పూరీ జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాకు తెలుగు లో మిస్టర్ బచ్చన్ మూవీ నుండి గట్టి పోటీ ఉంది. ఇక తమిళ్ లో తాంగాలన్ మూవీ నుండి గట్టి పోటీ ఉంది. ఇక హిందీ ఏరియాలో ఈ మూవీ కి మరీ గట్టి పోటీ ఉంది. హిందీలో ఆగస్టు 15 వ తేదీన చాలా సినిమాలు విడుదల కానున్నాయి.

ఇకపోతే ఆ సినిమాలలో ఏ సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా డబల్ ఇస్మార్ట్ మూవీ కి హిందీ ఏరియా నుండి కలెక్షన్లు భారీగా తగ్గే అవకాశం ఉంది. అలాగే ఆ తేదీన అనేక హిందీ సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఒక వేళ డబల్ ఈస్మార్ట్ మూవీ కి మంచి టాక్ వచ్చినా కూడా అదే స్థాయిలో ఆ సినిమాలకు కూడా మంచి టాక్ వచ్చినట్లు అయితే హిందీ ఏరియాలో ఈ మూవీ కి తక్కువ కలెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ మూవీ కి దేశ వ్యాప్తంగా కూడా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి రామ్ ఈ గట్టు పోటీని తట్టుకొని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: