రాజమౌళి తరువాత వరసపెట్టి సక్సస్ లు అందుకుంటూ టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయిన అనీల్ రావిపూడి ఈసారి తనదృష్టిని చిరంజీవి పై పెట్టి తన మార్క్ లో ఒక కామెడీ ఎంటర్ టైనర్ ను తీయాలని ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ఫిక్స్ అవ్వడంతో ఇప్పుడు ఆస్టోరీ లైన్ ను పూర్తి సినిమా స్క్రిప్ట్ గా మార్చడానికి అనీల్ రావిపూడి తన టీమ్ తో కలిసి విశాఖపట్టణంలో ఉంటూ ఈకథకు సంబంధించిన ఫైనల్ ఫినిషింగ్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీ కథ ఏప్రియల్ నెలాఖరుకు పూర్తికాగానే చిరంజీవికి ఈస్క్రిప్ట్ అందచేసి ఆయన ఓకె అంటే జూన్ నెలాఖరు నుండి షూటింగ్ మొదలుపెట్టి నాలుగు నెలలలో షూటింగ్ పూర్తి చేసి తనకు సెంటిమెంట్ గా కలిసి వస్తున్న రాబోయే సంక్రాంతికి విడుదలచేసే ప్లాన్ లో ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. అంతేకాదు ఈవిషయమై చిరంజీవి దగ్గర నుండి 100రోజుల కాల్ షీట్స్ తీసుకుని ఎక్కడా బ్రేక్ లేకుండా సినిమా పూర్తిచేయాలని అనీల్ రావిపూడి ప్లాన్ అని అంటున్నారు.  


ఈసినిమాకు సంబంధించి భీమ్స్ తో సహా దాదాపు ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీమ్ నే రిపీట్ చేస్తారని లీకులు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారంమేరకు అనిల్ రావిపూడి సిద్ధం చేసుకున్న ఈకథ వినోదం  ప్రధానంగా ఉంటూనే కొన్ని ఫారిన్ లొకేషన్స్ లో తీయవలసి ఉంటుంది అని అంటున్నారు. గతంలో చిరంజీవి నటించిన ‘ఘరానా మొగుడు’ ‘రౌడీ అల్లుడు’ ‘చంటబ్బాయి’ కథల ఛాయలు ఈమూవీ కథలో ఉంటాయని ఇన్ సైడ్ టాక్. 


ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి ‘భీమ్స్’ పాటల కంపోజింగ్ దాదాపు పూర్తి అయిందని ఈపాటల ట్యూన్స్ చిరంజీవికి కూడ బాగా నచ్చాయి అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈసినిమాకు సంబంధించి చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించే గ్లామర్ బ్యూటీ గురించి ఇప్పుడు అన్వేషణ కొనసాగుతోందని మెగా స్టార్ పక్కన పూజా హెగ్డే ఎంతవరకు సరిపోతుంది అన్నఆలోచన కూడ అనీల్ రావిపూడి మైండ్ లో ఉన్నట్లు టాక్..  



ReplyForward
Add reaction

మరింత సమాచారం తెలుసుకోండి: