టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకునే టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. గోపీచంద్ మలినేని ఆఖరుగా బాలకృష్ణ హీరోగా వీర సింహా రెడ్డి అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని , రవితేజ హీరోగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ లో ఓ సినిమా చేయనున్నట్లు అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.

కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. దానితో గోపీచంద్ మలినేని బాలీవుడ్ నటుడు అయినటువంటి సన్నీ డియోల్ హీరోగా జాట్ అనే హిందీ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ఏప్రిల్ 10 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన థీమ్ సాంగ్ విడుదల తేదీని , సమయాన్ని ప్రకటించింది. 

తాజాగా జాట్ మూవీ యూనిట్ ఈ సినిమా థీమ్ సాంగ్ ను ఈ రోజు అనగా ఏప్రిల్ 8 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 06 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన మొట్ట మొదటి హిందీ సినిమా జాట్. ఈ మూవీ కనుక మంచి విజయం సాధిస్తే హిందీ సినీ పరిశ్రమలో గోపీచంద్ మలినేనికి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: