
అయితే తాజాగా రామ్ వార్తల్లో నిలిచారు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న రామ్ ఇప్పుడు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. రామ్ ప్రస్తుతం rapo22 సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాలో రామ్ కి జంటగా నటిస్తున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల హీరో రామ్ ఓ హోటల్ గదిలో దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా అభిమనులతో పంచుకున్నాడు. భాగ్యశ్రీ కూడా తన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే వారిద్దరూ తీసుకున్న ఫోటోస్ ఒకే గది నుంచి తీసినవని తెలుస్తోంది. దీంతో ఇద్దరు కలిసి ఉన్నారని.. ప్రేమలో ఉన్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక లవ్ బర్డ్స్ రష్మిక, విజయ్ దేవరకొండ లాగా వీరిద్దరూ కూడా ప్రేమలో ఉన్నారాని.. వాళ్లలాగే హింట్ ఇస్తున్నారని టాక్ వినిపిస్తుంది. బ్యూటీ భాగ్యశ్రీ, మాస్ మహారాజ్ రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్ డమ్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. మరి వీరిద్దరి ప్రేమపైన వస్తున్న రూమర్స్ ఎంత వరకు నిజమో చూడాలి మరి. ఈ విషయంపై హీరో రామ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.