ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు ఎక్కువగా హారర్ థ్రిల్లర్ మూవీస్ చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హర్రర్ మూవీస్ చాలానే రిలీజ్ అయినప్పటికీ కొన్ని హర్రర్ సినిమాలు మాత్రం ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటాయి. వాటి పేరు వింటే చాలు నెటిజన్స్ భయపడిపోతుంటారు. అలాంటి చిత్రాల్లో ఒకటి మసూద. ఈ సినిమాని రాహుల్ యాదవ్ నక్క నిర్మించారు. మసూద మూవీలో నటి సంగీతం, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాకి డైరెక్టర్ సాయికిరణ్ దర్శకత్వం వహించారు. 

హర్రర్ థ్రిల్లర్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు ఏళ్లు గడిచినప్పటికీ ఈ సినిమా పేరు వింటే చాలు గడగడ వణికిపోతారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన భారీ కలెక్షన్స్ ని రాబట్టింది. అయితే ఈ మూవీ ఇప్పటికే ఓ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా మరో ఓ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి కూడా వచ్చేసింది. మసూద మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్లి చూసేయండి. 

 
ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఓటీటీలు వచ్చినప్పటినుండి చాలా మంది థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడడం మానేశారు. ఈ వారం మసూద సినిమాతో పాటుగా చాలా సినిమాలు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: