
హర్షిత్ రెడ్డి, శ్రియ కొనతం, గవిరెడ్డి శ్రీనివాస్, షాలిని పలువురు కీలకమైన పాత్రలు శుభం సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం విలేజ్ బ్యాక్గ్రౌండ్ హర్రర్ కామెడీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ గడిచిన కొన్ని నిమిషాల క్రితం విడుదల చేయగా అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు.. కాఫీ ఎలా అడుగుతావు నీ భార్యని అనే డైలాగ్ తో మొదలవుతుంది.. శ్రీవల్లి నీకు ఏమీ పని లేకపోతే కాఫీ ఇస్తావా అనే డైలాగుతో మొదలవుతుంది..
ఇక అదే కాఫీ ని నేను ఎలా అడుగుతానో తెలుసా అంటూ మరొక నటుడు చెప్పే డైలాగ్ ఉంటుంది.. ఇక తర్వాత పెళ్లి జరగడం ఆ తర్వాత హీరోయిన్ చెప్పే డైలాగులు కొంతమేరకు హర్రర్ గా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి శుభం సినిమా అటు కామెడీతో హర్రర్ తో కడుపుబ్బ నవ్వించే విధంగా కనిపిస్తోంది. చూస్తూ ఉంటే సమంత తన మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకునేలా కూడా కనిపిస్తోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఇందులో సమంత కూడా ఇందులో కనిపిస్తోంది. ముఖ్యంగా టీవీలో ప్రసారమయ్యే సీరియల్ కు ఈ సినిమా స్టోరీని లింక్ చేసినట్లుగా శుభం సినిమా ట్రైలర్ కనిపిస్తోంది. శుభం ట్రైలర్ మాత్రం ముగ్గురు యువకుల కథాంశంతో సీరియల్ స్టోరీ కథతో వస్తోంది సమంత కూడా ఇందులో మాతో పాత్రలో కనిపించబోతోంది.