
రీసెంట్ గానే ఓదెల 2 సినిమాలో నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ గా అందుకోలేకపోయింది . ఆ కారణంగానే తమన్నా పేరుకి పెద్ద పాపులారిటీ రాలేకపోయింది . అయితే ఈ సినిమాపై తమన్నా మాత్రం భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకుని ఉండింది . ఈ సినిమా హిట్ అవుతుంది అని తద్వారా ఆమెకు మంచి మంచి అవకాశాలు వస్తాయి అని ఆమె ఫ్యాన్స్ కూడా మాట్లాడుకున్నారు . అయితే ఇప్పుడు మాత్రం తమన్న కి అంత సీన్ లేదు అంటూ తేలిపోయింది . అంతేకాదు పర్సనల్గా ఓ ఇంటర్వ్యూలో ఆమె పెళ్లిపై చేసిన కామెంట్స్ కూడా ఆమెపై నెగిటివిటీ పెంచేసాయి . అయితే ఇలాంటి మూమెంట్లోనే మరో రిస్కీ పని చేయబోతుంది తమన్నా అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు .
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఐటమ్ సాంగ్ లో నటించబోతుందట. అసలే ఆమెకు హీరోయిన్గా అవకాశాలు రావడం లేదు . ఇలాంటి మూమెంట్లో ఐటమ్ సాంగ్ లో చిందులు వేయడం అవసరమా అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఆమె ఎంత ఎదురు చూసినా హీరోయిన్గా స్పెషల్ ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్స్ రాకపోవడంతో డబ్బులు కోసం ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు . తమన్న ఐటమ్ సాంగ్ చేయడం పెద్దకొత్తేమీ కాదు . గతంలో కూడా స్పెషల్ సాంగ్ లో మెరిసింది . అయితే అప్పుడు ఆమె టాప్ హీరోయిన్ ఇప్పుడు అంత టాప్ స్థాయిలో లేదు . మిల్కీ బ్యూటీ తమన్నా నా..? ఆవిడ ఒకప్పుడు హీరోయిన్లే అని మాట్లాడుకునే అంత వెనక్కి వెళ్ళిపోయింది తమన్నా . ఇలాంటి మూమెంట్లో ఐటెం సాంగ్ ఓకే చేసి కొంచెం తన కెరియర్ రిస్క్ లో పెట్టేసుకుందని అంటున్నారు సినీ విశ్లేషకులు..!