తమిళ నటుడు సూర్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు అనేక సినిమాలలో హీరోగా నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఇప్పటివరకు ఎన్నో విజయాలను అందుకున్న సూర్య తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఈయన నటించిన అనేక సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో ఈ నటుడికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఉంది.

ఆఖరుగా ఈయన శివ దర్శకత్వంలో రూపొందిన కాంగువ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకుంది. కంగువా లాంటి భారీ అపజయం తర్వాత సూర్య "రెట్రో" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ కి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా ... పూజా హెగ్డేమూవీ లో సూర్యకు జోడిగా నటించింది. ఈ మూవీ ని మే 1 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్లు కూడా ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 5 కోట్ల కలెక్షన్లకు చేరువగా వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం తమిళనాడు ఏరియాలోనే ఈ మూవీ కి అడ్వాన్స్ బుకింగ్ల ద్వారా 4.05 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా ఈ మూవీ విడుదలకు చాలా రోజులు మిగిలి ఉంది. దానితో ఈ మూవీ విడుదల తేదీ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ సినిమాకు భారీ ఎత్తున కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: