సింగర్ ప్రవర్తి ఎప్పుడైతే ఈ కాంపిటీషన్ నుంచి బయటకు వచ్చిందో అప్పటినుంచి నాకు డబ్బు లేదు 12 సంవత్సరాల వయసు నుంచే నేను కుటుంబ భారాన్ని మోస్తూ వస్తున్నాను. నేనెప్పుడూ కూడా నా పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడ బయట పెట్టలేదు. ఒక రోజు శ్రీముఖి అక్క నా దగ్గరికి వచ్చి యువర్ గోయింగ్ త్రు సంథింగ్ అదేంటో స్టేజిపై చెప్పు ఈ రోజు అని అన్నారు. దాని తర్వాత నా బాధలన్నీ స్టేజి పైన చెప్పుకొచ్చాను.. ఆ టైంలోనే మంగ్లీ అక్క నా దగ్గరికి వచ్చి మేము నీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పాడుతా తీయగా ఎపిసోడ్ లో జరిగిన సంఘటనని వెల్లడించింది. అయితే ప్రస్తుతం ప్రవస్థికి సంబంధించి వివాదం నడుస్తోంది.
ఈ వివాదంలో శ్రీముఖి మంగ్లీలకు ఎలాంటి సంబంధం లేకపోయినా వీరిద్దరూ నాకు సపోర్ట్ గా నిలిచారని చెప్పడంతో అది కాస్త వివాదంగా మారింది. ఎందుకంటే ప్రవస్తి పాడుతా తీయగాలో సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ లపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తనను కావాలని టార్గెట్ చేసి అన్యాయం చేస్తున్నారని బాడీ షేమింగ్ చేశారని ఆవేదన వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే తరుణంలో మంగ్లీ, శ్రీముఖి నాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పడంతో అది కాస్త వివాదంగా మారే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి