
వీళ్లిద్దరి మధ్య ఏవో కుటుంబ సమస్యలు . అది బయట పెట్టకుండానే వీళ్ళిద్దరూ ఒకరి పుట్టినరోజులకి ఒకరు విష్ చేసుకోకపోవడం .. ఒకరి సినిమాలకు ఒకరు అటెండ్ కాకపోవడం లాంటివి చేశారు . దీంతో ఫ్యాన్స్ ఊరుకుంటారా ఉప్పు నిప్పులా చిటపటలాడుతూ వచ్చారు . సోషల్ మీడియా వేదికగా ఎన్నెన్నో రాంగ్ కామెంట్స్ కూడా చేశారు . అయితే ఈ హీరోలు మాత్రం ఎప్పుడు తమ ఫ్యాన్స్ విషయంలో కూల్ గా ఉండండి అంటూ మాత్రం చెప్పుకు రాలేదు. దీంతో ఫాన్స్ మరింత స్ధాయి లో రెచ్చిపోయారు.
సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ ఫ్యాన్స్ ఓవరాక్షన్ ఈ స్టార్ హీరోస్ కి బిగ్ ఆఫర్స్ రాకుండా చేసేస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. రామ్ చరణ్ తో సినిమా తెరకెక్కిస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫ్లాప్ చేస్తారు ఏమో అన్న భయంతో బడా డైరెక్టర్ లు రామ్ చరణ్ కు అవకాశాలు ఇవ్వడమే మానేస్తున్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ తో సినిమా తెరకెక్కిస్తే మెగా ఫాన్స్ ఫ్లాప్ చేసేస్తారేమో దాని వల్ల ప్రొడ్యూసర్స్ కి నష్టాలు వస్తాయి ఏమో అన్న భయంతో అల్లు అర్జున్ తో కూడా సినిమాలు తెరకెక్కించడానికి భయపడిపోతున్నారు కొందరు డైరెక్టర్స్ . దీంతో ఈ బిగ్ బడా పాన్ ఇండియా స్టార్స్ కి డైరెక్టర్స్ కొరత ఏర్పడుతుంది . చేసిన డైరెక్టర్స్ తోనే మళ్లీ చేయడం లేదంటే ఆల్రెడీ కమిట్ అయిన డైరెక్టర్ కి కాల్ షీట్స్ ఇవ్వడం తప్పిస్తే కొత్త డైరెక్టర్లకి వీళ్ళు కనెక్ట్ కాలేకపోతున్నారు. అసలు వీళ్ళకి అవకాశాలు ఇవ్వడం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఇదంతా ఫ్యాన్స్ వల్లే వచ్చింది అని ఫ్యాన్స్ హద్దుల్లో ఉంటే స్టార్స్ కి ఈ కష్టాలు ఎందుకు వస్తాయి అని మాట్లాడుతున్నారు కామన్ పీపుల్స్..!