
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా ఆఫర్ ని అల్లు అర్హాకి కాకుండా తన మనవరాలికి దక్కేలా ప్లాన్ చేస్తున్నాడట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది . అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో ఓ చైల్డ్ క్యారెక్టర్ కోసం అల్లుఅర్జున్ కూతురు అల్లు అర్హ అయితే బాగుంటుంది అని అనుకున్నారట అనిల్ రావిపూడి. బన్నీ కూతురికి ఆల్రెడీ కెమెరా ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది .
ఆ కారణంగానే అనిల్ రావిపూడి ఈ క్యారెక్టర్ కోసం అర్హా ని అనుకున్నారట . కానీ చిరంజీవి మాత్రం ఆ క్యారెక్టర్ లో అల్లు అర్హ కాకుండా శ్రీజ రెండో కుమార్తె అయితే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేశారట . కానీ అనిల్ రావిపూడి మాత్రం ఇంకా ఆ రోల్ కోసం ఎవరిని ఫైనలైజ్ చేయలేదు అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . ఈ రోల్ కి అల్లు అర్హ బాగుంటుందా..? లేక శ్రీజ చిన్న కూతురు బాగుంటుందా ..? అనే విషయం పక్కన పెడితే చిరంజీవి ఇలా ఒక ఆఫర్ ను చేతులు మార్చేస్తాడా అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . పైగా అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి ఈమధ్య అస్సలు కుదరడం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్న ఇదే మూమెంట్లు ఇలాంటి ఒక వార్త బయటకు రావడం మెగా పరువును తీసేసినట్లయింది.దీని పట్ల ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.