అలనాటి అందాల తార మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మీనా తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఒకానొక సమయంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మీనా తన హవాను కొనసాగించింది. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక మీనా తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం సినిమాలలోను నటించారు. చాలా రోజుల తర్వాత మీనా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. హీరోయిన్ గా కాకుండా అక్క, వదిన లాంటి పాత్రలలో నటిస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటున్నారు. 

మీనా సినిమాల పరంగా తన కెరీర్ మంచి పీక్స్ లో కొనసాగుతున్న సమయంలోనే 2005లో విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. అనంతరం మళ్లీ వరుసగా సినిమా షూటింగ్ లలో పాల్గొన్నారు. అనంతరం వీరికి ఓ పాప కూడా జన్మించింది. ఆ తర్వాత మీనా ఎప్పటిలానే తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగారు. ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితం కొనసాగుతున్న సమయంలో మీనా భర్త అకస్మాత్తుగా మరణించాడు. అనారోగ్యం కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇక తన భర్తను మర్చిపోవడానికి మీనాకు చాలా సమయం పట్టింది.

ఆ క్రమంలో చాలా తక్కువ వయసులో మీనా భర్త చనిపోవడంతో రెండో వివాహం చేసుకుంటుందని అనేక రకాలుగా వార్తలను వైరల్ చేశారు. కానీ మీనా ఎవరిని కూడా వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. తన కూతురిని చూసుకుంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. ఈ క్రమంలోనే మీనాను కొద్ది రోజుల నుంచి ఓ టాలీవుడ్ హీరో చాలా ఇబ్బంది పెడుతున్నాడట. తనను వివాహం చేసుకోమని చాలా సంతోషంగా చూసుకుంటానని చెబుతున్నారట. అయినప్పటికీ మీనాహీరో మాటలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుందట. ఈ విషయం మీనా సన్నిహితుల ద్వారా తెలుగులోకి వచ్చింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: