జాను..జాను... జాను గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు ఎలా మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు . ఒకప్పుడు డి విన్నర్ గా పాపులర్  అయిన ఈ ఫోక్ డాన్సర్ జాను ఈ మధ్యకాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ , డాన్స్ ఐకాన్ అంటూ చాలా చాలా టీవీ షో లతో తనదైన స్టైల్ లో తన వాక్చాతుర్యంతో కట్టిపడేసి ఫుల్ బిజీబిజీగా అయిపోయింది . ఒక టైర్ 2 హీరోయిన్ కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ జాను కి ఉంది అని చెప్పడంలో సందేహం లేదు . అయితే ఎవరు ఊహించిన విధంగా జాను ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది .


"నా పెళ్లి గురించి తప్ప మీకు ఏ పని పాట లేదా..?" అంటూ బోరున ఏడ్చింది.  దీనితో అందరూ ఫీల్ అయిపోయారు. అయితే ఆ వీడియో రిలీజ్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే రెండో పెళ్లి చేసుకుంటున్నాను అంటూ షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చింది ఈ జాను . ఆ తర్వాత ఆమె పెళ్లి టాపిక్ హాట్ టాపిక్ గా మారిపోయింది . ఫోక్ సింగర్ దిలీప్ సేదేవ్గన్ ని పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ అఫీషియల్ గా ప్రకటించింది.  ఆయన కూడా మీరంతా అనుకున్నట్టే మేము పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ సీక్రెట్ బంధాన్ని సెన్సేషన్ గా మార్చేశాడు . అయితే ఇప్పుడు ఎటోచి బకరా అయింది జాను మాజీ భర్త నే.



 జాను మొదటి భర్త డాన్సర్ టోనీ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు . టోనీ - జాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళకి లిరి అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు . అయితే ఇప్పుడు టోనీ రీసెంట్గా  ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధను వెళ్ళగక్కడం  కాకుండా జానుకి సంబంధించిన సెన్సేషనల్ మ్యాటర్ ని బయట పెట్టేశాడు . "మీరు చూస్తున్నది టోని కాదు ఆ టోని ఎప్పుడో చచ్చిపోయాడు ..చచ్చి  బతికిన టోని ఇప్పుడు ఇలా ఉన్నాడు అంటే దానికి కారణం కేవలం ఫ్రెండ్స్ " అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయిపోయారు.



అంతేకాదు తను ఇంటికి కూడా వెళ్లడం లేదని ఇంటికి వెళ్తే తన కొడుకు గుర్తొస్తాడు అని.. అసలైన ప్రేమ ఏంటి అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేది అని .. మనం మన పిల్లలకి ఇచ్చేది అని ..మిగతాదంతా కల్పితం అని అదంతా ఒక నాటకం అని చాలా ఎమోషనల్ గా రియాలిటీని గుర్తు చేసుకున్నారు.  కాగా తన కొడుకు తన దగ్గర లేకుంటే అసలు తను మనిషిలా లేను అని .. తన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది అని .. కొన్ని శబ్దాలు కూడా వినపడడం లేదని తన ఆరోగ్యం పాడైపోయిన విషయాన్ని ఓపెన్ గానే బయటపెట్టాడు .

తన కొడుక్కి దూరంగా ఉండలేకపోతున్నాను అని.. చాలా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు . అంతేకాదు జాను తో ఆయన రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అయ్యింది ..? ఎలా ఎండ్ అయ్యింది..? ఆ రిలేషన్షిప్ బ్రేకప్ అవ్వడానికి కారణం ఎవరు..? అనే విషయాలను పరోక్షంగా బయట పెట్టాడు . మరీ ముఖ్యంగా టోనీ ఇంటర్వ్యూలో అందరికీ బాగా నచ్చింది "ప్రేమ అనేది కేవలం తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తుంది అని .. అది మనం మన పిల్లలకి ఇచ్చే ప్రేమ అంతే అని ..మిగతాదంతా జస్ట్ నాటకమని అసలు ఆమెకు కామన్ సెన్స్ లేదు అని జాను లాంటి వాళ్లను అసలు ఇండస్ట్రీలో బ్యాండ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు.  ఒకే ఒక్క ఇంటర్వ్యూ తో తన మాజీ భార్య జాను పరువు మొత్తం తీసేశాడు టోనీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: