మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి చాలా సంవత్సరాల క్రితం కెరీర్ను మొదలు పెట్టాడు. కెరియర్ను ప్రారంభించిన కొత్తలో చిరంజీవి అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో , విలన్ పాత్రలలో నటించాడు. అలా చిన్న చిన్న పాత్రలలో , విలన్ పాత్రలలో నటించిన చిరు తను నటించిన సినిమాల్లో తన అద్భుతమైన నటన ప్రదర్శనను కనబరిచి ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. ఆ తర్వాత చిరంజీవి హీరో గా నటించిన సినిమాలలో అనేక సినిమాలు అద్భుతమైన స్థాయి విజయాలను అందుకోవడంతో చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు.

స్టార్ హీరో స్థాయికి ఎదగడం మాత్రమే కాకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి కెరీర్లో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమాలలో గ్యాంగ్ లీడర్ మూవీ ఒకటి. ఈ మూవీ లో విజయ శాంతి హీరోయిన్గా నటించగా ... విజయ బాపినీడు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. బప్పి లహరి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ 1991 వ సంవత్సరం మే 9 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే చిరంజీవి హీరో గా రూపొందిన గ్యాంగ్ లీడర్ మూవీ విడుదల అయ్యి నిన్నటి తో 34 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మరి ఈ సినిమా విడుదల అయ్యి 34 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ మూవీ డైరెక్ట్ గా ఎన్ని సెంటర్లలో 100 డేస్ ను కంప్లీట్ చేసుకుంది అనే వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ డైరెక్ట్ గా 30 సెంటర్లలో 100 డేస్ ను కంప్లీట్ చేసుకొని ఆ సమయంలో అద్భుతమైన రికార్డును సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: