పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కి ఉన్న క్రేజ్ టాలీవుడ్ లో ఏ హీరోకి లేదు. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో అందరికీ తెలుసు. ఈ మూవీలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది. ఈ మూవీకి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి రవి బసృర్ సంగీతం అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో కూడా రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకుంది. ఈ మూవీ హిందీ వెర్షన్ లో ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా ఏకంగా 450 రోజులు ఇండియా వైడ్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలలో ఒకటిగా నిలిచి.. రికార్డ్ బ్రేక్ చేసింది.

ఇకపోతే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే చాలు ప్రాణాలు ఇచ్చే అంతా ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. ప్రభాస్ ని టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ డార్లింగ్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఇండియా లోనే కాదు.. ఇతర దేశాలలో కూడా పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి ఏ సినిమా చేసినా పాన్ ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది. ఇక సోషల్ మీడియాలో విషయానికి వస్తే.. ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్ ఆయన గురించి అలా ట్రెండ్ అవుతూనే ఉంటుంది.

త్వరలో ప్రభాస్ స్పిరిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాపై నెటిజన్స్ కి భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందించనున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. స్పిరిట్ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోతుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ వార్త నిజమైతే మాత్రం పండగే అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: