టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన కుటుంబలలో మెగా కుటుంబం ఒకటి. మెగా కుటుంబంలో ప్రస్తుతం ఎంతో మంది హీరోలుగా కంటిన్యూ అవుతున్నారు. వారిలో అనేక మంది అద్భుతమైన స్థాయిలో ప్రస్తుతం కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలలో ఓ ముగ్గురు హీరోలతో ఓ దర్శకుడు సినిమాలను రూపొందించగా ఆ ముగ్గురికి కూడా ఆ సినిమాల ద్వారా అపజయాలే దక్కాయి. ఇంతకు మెగా ఫ్యామిలీకి అస్సలు కలసిరని ఆ డైరెక్టర్ ఎవరో తెలుసుకుందాం.

మెగా ఫ్యామిలీకి అస్సలు కలిసి రాని డైరెక్టర్ల లిస్టులో శ్రీను వైట్ల ఒకరు. చాలా సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీను వైట్ల "అందరివాడు" అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత శ్రీను వైట్ల , మెగాస్టార్ చిరంజీవి కుమారుడు అయినటువంటి రామ్ చరణ్ హీరో గా రూపొందిన బ్రూస్లీ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన. ఈ మూవీ లో చిరంజీవి కూడా చిన్న క్యామియో పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మెగా హీరోలలో ఒకరు అయినటువంటి వరుణ్ తేజ్ కొంత కాలం క్రితం మిస్టర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇలా శ్రీను వైట్ల , మెగా హీరోలతో మూడు సినిమాలను రూపొందించగా ఆ మూడు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sv