- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి నట సౌర్వ‌భౌమ నందమూరి తారక రామారావు తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నారు. ఆయన సినిమాలలో నుంచి రాజకీయాల్లోకి వచ్చి అక్కడ కూడా తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. ఆయన తర్వాత ఆయన వారసులు ఆయన మనవళ్లు కూడా తెలుగు సినిమా రంగంలో హీరోలుగా కొనసాగుతూ స్టార్ హీరోలుగా తమ దైన ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలోనే నందమూరి వంశంలో నాలుగో తరం హీరో కూడా వెండితెరపై గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చేశాడు. నందమూరి హరికృష్ణ మనవడు దివంగత నందమూరి జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా వైవిఎస్ చౌదరి కొత్త సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. న్యూ టాలెంట్ రోర్స్‌ పతాకంపై వైవిఎస్ చౌదరి సతీమణి య‌లమంచిలి గీతా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.


ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా గారపాటి లోకేశ్వరి - దగ్గుబాటి పురందేశ్వరి - నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా కూచిపూడి డ్యాన్సర్ అచ్చ తెలుగు అమ్మాయి వీణారావు హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే నారా భువనేశ్వరి మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ ఎంత కీర్తి తెచ్చుకున్నారో ? ఈ తారక రామారావు కూడా అలాగే ఎదగాలని పేర్కొన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమార్తె లోకేశ్వరి మాట్లాడుతూ నాన్నకు ఎవరూ సాటి రారు ... ఆయన లెగిసిని ముందుకు తీసుకు వెళ్ళటానికి ఆయన కుమారులు మనవళ్లు ఎంతో కృషి చేస్తున్నారు ... ఇప్పుడు ఆయన ముని మనవడు ఇండస్ట్రీలోకి వస్తున్నాడు ... మీడియా ప్రోత్సాహం అతడికి చాలా అవసరం తారక రామారావును అభినందించండి ...వై వి ఎస్ చౌదరికి కృతజ్ఞతలు అని తెలిపారు.


ఇక బిజెపి నాయకురాలు రాజమహేంద్రవరం ఎంపీ పురందరేశ్వరి మాట్లాడుతూ ఈ రోజు నందమూరి కుటుంబం నుంచి మరో తరం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ... కళాకారుడు ఎంతో తపస్సు చేయాలి మా నాన్న ఓ కళాతపస్వి .. ఆయన క్రమశిక్షణతో తెలుగు సినిమా రంగానికి తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఆ తర్వాత బాలకృష్ణ - హరికృష్ణ ఇద్దరు కూడా తెలుగు సినిమా రంగంపై జరిగిన ముద్ర వేశారు. ఇప్పుడు మేమంతా రామ్ అని పిలుచుకునే ఎన్టీఆర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు ...అతనికి ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు ..ఆశీస్సులు కావాలని వైవే చౌదరికి అభినందనలు అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: